Color Mode Toggle

వీరి ద్వారా ప్రమోట్ చేయబడింది
Image 1 Image 2 Image 3 Image 4
ప్రజాదరణ పొందిన శోధనలు: ఎన్.సి.ఎఫ్.ఇ, టెండర్లు, ఎఫ్.ఇ.పి.ఎ.

వీరి ద్వారా ప్రమోట్ చేయబడింది:

మనీ స్మార్ట్ స్కూల్ ప్రోగ్రామ్ (ఎంఎస్ఎస్పీ )

ప్రతి విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధికి ముఖ్యమైన జీవన నైపుణ్యమైన ఆర్థిక అక్షరాస్యతను మెరుగుపరచడానికి పాఠశాలల్లో నిష్పాక్షిక ఆర్థిక విద్యను అందించడానికి ఎన్సిఎఫ్ఇ యొక్క కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది; విద్య మరియు అవగాహన మరియు మొత్తం తరాన్ని శక్తివంతం చేసే స్థిరమైన ఆర్థిక అక్షరాస్యత ప్రచారాన్ని స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది.

మనీ స్మార్ట్ స్కూల్ యొక్క ముఖ్యమైన లక్షణాలు
  • ఎన్.సి.ఎఫ్.ఇ పాఠశాలలను తమ ప్రస్తుత పాఠ్యాంశాలలో భాగంగా ఆరునుండి పదవ తరగతి విద్యార్థులకు స్వచ్ఛందంగా ఆర్థిక అక్షరాస్యతను పరిచయం చేయవలసిందిగా ఆహ్వానిస్తుంది.
  • ఎన్.సి.ఎఫ్.ఇ మరియు సి.బి.ఎస్.ఎ సంయుక్తంగా ఆరు నుండి పదవ తరగతి విద్యార్ధులకోసం ఐదు ఆర్ధికవిద్యా వర్క్ బుక్ లను స్టడీ మెటీరియల్‌ని అభివృద్ధి చేశాయి
  • మా ఆర్థిక అక్షరాస్యత పాఠ్యాంశాలు వివిధ తరగతులకు ఇప్పటికే ఉన్న సబ్జెక్టులతో అనుసంధానించే విధంగా అభివృద్ధి చేయబడ్డాయి.
  • పాఠశాలలు తమ ఉపాధ్యాయులను శిక్షణ కోసం పాఠశాల ఉపాధ్యాయుల కోసం ఎన్.సి.ఎఫ్.ఇ అందచేసే ఆర్థిక విద్యా శిక్షణా కార్యక్రమం (ఎఫ్‌ఇటిపి) కి పంపవచ్చు. ప్రత్యామ్నాయంగా, మేము ఆసక్తిగల పాఠశాలల కోసం వారి స్వంత ప్రాంగణంలో విడిగా శిక్షణా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు.
  • ఈ ఎన్.సి.ఎఫ్.ఇ సర్టిఫికేట్ పొందిన మనీ స్మార్ట్ టీచర్లు వారి సంబంధిత పాఠశాలల్లో విద్యార్థులకు ఆర్థిక విద్యా తరగతులను నిర్వహించడంలో దోహదపడతారు. అంతేకాక విద్యార్థుల మూల్యాంకనం కోసం, పాఠశాలలు ఎన్.సి.ఎఫ్.ఇ నిర్వహించే నేషనల్ ఫైనాన్షియల్ లిటరసీ అసెస్‌మెంట్ పరీక్షలో పాల్గొనేలా వారిని ప్రోత్సహించవచ్చు.
  • పాఠశాలలు వారి స్వంత మూల్యాంకనాన్ని నిర్వహించాలని భావిస్తే . ఎన్.సి.ఎఫ్.ఇ వారికి అవసరమైన మద్దతును అందచేస్తుంది
పాఠశాలకు ప్రయోజనాలు

మనీ స్మార్ట్ స్కూల్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్న పాఠశాలలకు ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, వారి విద్యార్థులు ఆర్థికంగా అక్షరాస్యులైన తర్వాత నేటి సంక్లిష్ట ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవలను ఎదుర్కోవడానికి మరియు వారి స్వంత డబ్బును నిర్వహించే విషయంలో వివేకవంతమైన ప్రవర్తన మరియు వైఖరిని ప్రదర్శించడానికి మెరుగ్గా సన్నద్ధమవుతారు. ఇంతే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా వున్నాయి

  • ఈ కార్యక్రమాన్ని అమలు చేసే పాఠశాలలు మనీ స్మార్ట్ స్కూల్స్‌గా ధృవీకరించబడతాయి.
  • పాఠశాలలు తమ వెబ్‌సైట్ మరియు సోషల్ నెట్‌వర్క్‌లలో ఉంచగలిగే సర్టిఫికేట్ మరియు బ్యాడ్జ్ ఎన్.సి.ఎఫ్.ఇ ద్వారా జారీ చేయబడుతుంది.
  • విద్యార్థులు నేషనల్ ఫైనాన్షియల్ లిటరసీ అసెస్‌మెంట్ టెస్ట్‌లో మెరుగైన పనితీరు కనబరుస్తారు.
  • ఎన్.సి.ఎఫ్.ఇ పాఠశాల/విద్యార్థులు ఆర్ధిక రంగాన్ని నియంత్రించే సంస్థలను సందర్శించడానికి వీలు కల్పిస్తుంది, అక్కడ వారు మన దేశంలోని నియంత్రణ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు
  • ఎన్.సి.ఎఫ్.ఇ యొక్క భవిష్యత్తు ప్రయత్నాలలో పాఠశాలలు ప్రాధాన్యతను పొందుతాయి మరియు మనీ స్మార్ట్ పాఠశాలలకు సంబంధించి ఎన్.సి.ఎఫ్.ఇ యొక్క సోషల్ మీడియా ప్రచారంలో ఈ పాఠశాలలు భాగంగా ఉంటాయి

ఎన్.సి.ఎఫ్.ఇ ఇప్పటికే పాఠశాల విద్యార్థుల కోసం నేషనల్ ఫైనాన్షియల్ లిటరసీ అసెస్‌మెంట్ టెస్ట్ (ఎన్.ఎఫ్.ఎల్.ఏ.టి ) మరియు స్కూల్ టీచర్లకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (ఎఫ్‌ఇటిపి) అనే రెండు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆర్థిక అక్షరాస్యత పాఠ్యాంశాలను ప్రవేశపెట్టడానికి మేము పాఠశాలలను ఆహ్వానించే మా మనీ స్మార్ట్ స్కూల్ ప్రోగ్రామ్ అదే దిశలో సహజమైన పురోగతి సాధిస్తుంది .
fe_programs@ncfe.org.in
+91- 022-68265115

మా వార్తాలేఖలకు సభ్యత్వాన్ని పొందండి

తాజా వార్తలు & అప్‌డేట్‌లను స్వీకరించడానికి ఈరోజే సైన్ అప్ చేయండి

ప్రజాదరణ పొందిన శోధనలు: ఎన్.సి.ఎఫ్.ఇ, టెండర్లు, ఎఫ్.ఇ.పి.ఎ.
Skip to content