Color Mode Toggle
Insurance awareness quiz (BimaGyaan)

వీరి ద్వారా ప్రమోట్ చేయబడింది
Image 1 Image 2 Image 3 Image 4
ప్రజాదరణ పొందిన శోధనలు: ఎన్.సి.ఎఫ్.ఇ, టెండర్లు, ఎఫ్.ఇ.పి.ఎ.

వీరి ద్వారా ప్రమోట్ చేయబడింది:

ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫర్ అడల్ట్స్ (ఎఫ్ఈపీఏ)

ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫర్ అడల్ట్స్ (ఎఫ్ఈపీఏ)ను ఎన్సీఎఫ్ఈ 2019లో ప్రారంభించింది. ఎఫ్ఈపీఏ (ఎఫ్ఈపీఏ) అనేది రైతులు, మహిళా బృందాలు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక బృందాలు, సంస్థ ఉద్యోగులు, పుణ్యాభివృద్ధిశిక్షకులు మొదలైన వయోజన జనాభాలో ఆర్థిక అవగాహనను పెంపొందించడానికి రూపొందించి అమలు చేయబడిన ఒక ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం. ఈ కార్యక్రమం నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించబడుతుంది మరియు స్పెషల్ ఫోకస్డ్ డిస్ట్రిక్ట్స్ (ఎస్‌ఎఫ్‌డీ)లపై దృష్టి సారించింది. ఎన్సీఎఫ్ఈ ద్వారా ఏటా 5,000కు పైగా ఎఫ్ఈపీఏలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం “ఆర్థిక అవగాహన మరియు సాధికార భారతదేశం” అనే మా దార్శనీకతకు గణనీయంగా దోహదం చేస్తుందని ఆశించబడుతోంది.
fe_programs@ncfe.org.in  +91- 022-68265115

ఎఫ్ఈపీఏ (ఎఫ్ఈపీఏ) యొక్క ముఖ్య లక్షణాలు

లక్ష్యం
ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తులను మరింత సమర్థవంతంగా ఉపయోగించడానికి సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలో విశ్వాసాన్ని కలిగించే ఆర్థిక అవగాహనను సృష్టించడం, తద్వారా ఎక్కువ మందిని అధికారిక ఆర్ధిక రంగ పరిధిలోకి తీసుకురావడం.

లక్ష్య సమూహం
వయోజన జనాభా అంటే వివిధ సంస్థల ఉద్యోగులు, స్వయం సహాయక బృంద సభ్యులు, రైతులు మరియు గ్రామీణ ప్రజలు, మహిళా బృందాలు, గృహస్థులు, ఎంజిఎన్ఆర్ఇజిఎ కార్డుదారులు, దళాలకు చెందిన సిబ్బంది లేదా సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాలు.

ఉచితం
వర్క్ షాప్ ఉచితంగా నిర్వహించబడుతుంది మరియు పాల్గొనేవారి నుంచి ఎలాంటి డబ్బు వసూలు చేయబడదు. ఎన్సీఎఫ్ఈ మెటీరియలుని ఉచితంగా అందిస్తుంది.

శిక్షకులు
భారతదేశం అంతటా ఎఫ్ఈపీఏ వర్క్ షాప్ లను నిర్వహించడం కొరకు ఎన్.సి.ఎఫ్.ఇ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ల నెట్వర్కును కలిగి ఉంది.’

అంశం.
 ఎన్సీఎఫ్ఈ ఎఫ్ఈపీఏ కొరకు ఒక ఆర్థిక విద్య మెటీరియలును సమాజంలోని వయోజన జనాభాను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి చేసింది, దానిలో ఆదాయం, వ్యయాలు ,బడ్జెట్, పొదుపు, బ్యాంకింగ్, క్రెడిట్ మరియు రుణ నిర్వహణ, డిజిటల్ లావాదేవీలు, బీమా, పెట్టుబడి, పదవీ విరమణ మరియు పెన్షన్లు, ప్రభుత్వ ఆర్థిక సమ్మిళిత పథకాలు, మోసాల నుండి  రక్షణ – పోంజీ పథకాల విషయంలో జాగ్రత్త మరియు రిజిస్టర్ చేసుకోని పెట్టుబడి సలహాదారులు మరియు ఫిర్యాదుల పరిష్కారం మొదలగు అంశాలు ఉన్నాయి.

మా వార్తాలేఖలకు సభ్యత్వాన్ని పొందండి

తాజా వార్తలు & అప్‌డేట్‌లను స్వీకరించడానికి ఈరోజే సైన్ అప్ చేయండి

ప్రజాదరణ పొందిన శోధనలు: ఎన్.సి.ఎఫ్.ఇ, టెండర్లు, ఎఫ్.ఇ.పి.ఎ.
Skip to content